కొండగట్టులో కూలిన చలవ పందిరి.. 15మంది భక్తులకు గాయాలు

16121చూసినవారు
TG: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో అపశృతి చోటుచేసుకుంది. ఆలయం వద్ద హనుమాన్ విజయ సందర్భంగా ఏర్పాటు చేసిన చలువ పందిరి అకస్మాత్తుగా కూలిపోవడంతో సుమారు 15 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నాసిరకంగా పందిరి నిర్మించారని ఆరోపిస్తున్నారు. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి, విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్