AP: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. తిరుగిరులంతా భక్తులతో కిటకిటలాడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు పూర్తిగా కిక్కిరిసిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అలిపిరి సప్తగిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు రద్దీ నెలకొంది. అలిపిరి చెక్ పాయింట్ నుంచి గరుడ సర్కిల్ వరకు వాహనాలు నిలిచిపోయాయి.