బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించిన ‘ధురంధర్’ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. శుక్రవారం, జనవరి 30 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ‘నెట్‌ఫ్లిక్స్’లో ఈ సినిమా ప్రసారం కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది. కేవలం హిందీలోనే కాకుండా, దక్షిణాది భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.