AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం గుడిచర్ల, కొత్తూరు గ్రామాల్లో డయేరియా విజృంభించడంతో 25 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం నల్లాల్లో వచ్చిన నీటిని తాగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు, నాయకులు ఆరోపిస్తున్నారు. అస్వస్థతకు గురైన వారికి స్థానిక పీహెచ్‌సీలో వైద్యం అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమై, మెరుగైన చికిత్స అందించడంతో పాటు వ్యాధి ప్రబలకుండా రెండు గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు.