AP: శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో అతిసారం (డయేరియా) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. గత రెండు రోజుల్లో ఎనిమిది మందిలో లక్షణాలు కనిపించాయి. టెక్కలి ఏరియా ఆస్పత్రిలో డయేరియాకి చికిత్స పొందుతూ చిన్నారావు అనే వ్యక్తి మృతి చెందారు. దీంతో గ్రామంలో తాగునీటి నమూనాలను అధికారులు సేకరించారు. ముందు జాగ్రత్త చర్యగా చేపలు, మాంసం విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు.