ముద్దు భారతదేశంలోనే పుట్టిందా?

4043చూసినవారు
ముద్దు భారతదేశంలోనే పుట్టిందా?
చరిత్రకారులు, మానవ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ముద్దుకు సంబంధించిన మొట్టమొదటి లిఖితపూర్వక ఆధారాలు క్రీస్తుపూర్వం 1500 నాటి ప్రాచీన భారతదేశంలోని వేద గ్రంథాలలో లభించాయి. మహాభారతం, కామసూత్రాల్లోనూ ముద్దుల రకాలు, సామాజిక ప్రాధాన్యతలు విశ్లేషించబడ్డాయి. భారతదేశం నుండి ఈ సంస్కృతి గ్రీస్, రోమన్ సామ్రాజ్యాలకు విస్తరించింది. రోమన్లు ముద్దును మూడు రకాలుగా విభజించారు: ఆస్క్యులమ్ (బుగ్గపై), బాసియమ్ (పెదవులపై), సవియోలమ్ (గాఢమైన శృంగార). మధ్యయుగంలో సామాజిక హోదాను బట్టి రాజుల చేతులు, పాదాలు ముద్దుపెట్టుకునేవారు. కాలక్రమేణా ఇది ప్రపంచవ్యాప్త ప్రేమ వ్యక్తీకరణగా మారింది.

సంబంధిత పోస్ట్