KYC అప్‌డేట్‌ అంటూ కాల్, లేదా మెసేజ్ వచ్చిందా?.. అయితే టార్గెట్ మీరే!

5610చూసినవారు
KYC అప్‌డేట్‌ అంటూ కాల్, లేదా మెసేజ్ వచ్చిందా?.. అయితే టార్గెట్ మీరే!
దేశంలో LPG కొరత ఏర్పడిన వేళ సైబర్ మోసాలు పెరుగుతున్నాయి. కేవైసీ అప్‌డేట్, సిలిండర్ బుకింగ్ పేరుతో కాల్స్, మెసేజ్‌లు చేసి వినియోగదారులను మభ్యపెడుతున్నారు. OTP, బ్యాంక్ వివరాలు చెప్పాలని ఒత్తిడి తెచ్చి డబ్బులు దోచుకుంటున్నారు. తెలియని లింకులు పంపించి చెల్లింపులు చేయిస్తుండటం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు, OTP, PIN వివరాలు ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. గ్యాస్ బుకింగ్ కోసం అధికారిక యాప్‌లు మాత్రమే ఉపయోగించాలని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే 1967 లేదా 100కు ఫిర్యాదు చేయాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్