డ్వాక్రా మహిళల కోసం ప్రభుత్వం దీదీ దుకాణ్‌లను ఏర్పాటు చేస్తోంది. పంచాయతీల వారీగా జనాభా, కొనుగోలు శక్తి, కుటుంబ వ్యయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని దుకాణాల సంఖ్యను నిర్ణయిస్తారు. విక్రయానికి అవసరమైన సరకుల కొనుగోలుకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బ్యాంకు రుణం అందజేస్తారు. విక్రయ విధానం, నాణ్యమైన సరకుల ఎంపిక, బ్రాండింగ్, ఆన్‌లైన్ కొనుగోళ్లపై శిక్షణ ఇస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉండేందుకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తారు.