ఐపీఎల్ 2026లో విదేశీ ఆటగాళ్ల తీరుపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లు జీతం తీసుకుంటున్నా కొందరు ఆటగాళ్లు లీగ్‌కు అందుబాటులో ఉండటం లేదని, మరికొందరు మధ్యలోనే వైదొలుగుతున్నారని మండిపడ్డారు. తమ ఆరోగ్యం, లభ్యతపై ఆటగాళ్లకు ముందే తెలియదా అని ప్రశ్నించారు. దేశం ముఖ్యం అయినప్పటికీ, ఫ్రాంచైజీల పట్ల నిబద్ధత చూపాలని అన్నారు. కొన్ని దేశాల క్రికెట్ బోర్డులు ఐపీఎల్ ఆడేందుకు ఆటగాళ్లకు ఎన్వోసీ ఇవ్వకపోవడంపై కూడా గవాస్కర్ సీరియస్ అయ్యారు.