ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం భిన్నంగా ఉంది. బుధవారం పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 3-5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఒంగోలులో అత్యధికంగా 39°C ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది. సాయంత్రం కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో వర్షాలు కురుస్తాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండ కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.