పాలిసెట్‌ పరీక్షకు డిజిటల్‌ పాఠాలు: టీ-సాట్‌ సీఈవో

6494చూసినవారు
పాలిసెట్‌ పరీక్షకు డిజిటల్‌ పాఠాలు: టీ-సాట్‌ సీఈవో
మే 13న నిర్వహించే పాలిసెట్‌ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఏప్రిల్ 1 నుంచి 12 వరకు టీ-సాట్ డిజిటల్ పాఠాలను అందించనుంది. కొండా లక్ష్మణ్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షకు రోజుకు 2 గంటల చొప్పున 84 ఎపిసోడ్లు ప్రసారం చేయబడతాయి. గణితం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్ర సబ్జెక్టుల్లో అనుభవజ్ఞులైన లెక్చరర్లు బోధించే ఈ పాఠాలు విద్యా ఛానెల్‌లో సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు, నిపుణ ఛానెల్‌లో రాత్రి 9 నుంచి 11 గంటల వరకు ప్రసారమవుతాయని టీ-సాట్ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్