మరోసారి తండ్రి కాబోతున్న దర్శకుడు నాగ్ అశ్విన్

8158చూసినవారు
మరోసారి తండ్రి కాబోతున్న దర్శకుడు నాగ్ అశ్విన్
‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమై, ‘మహానటి’, ‘కల్కి 2898ఏడీ’ వంటి విజయవంతమైన చిత్రాలతో పేరుగాంచిన నాగ్ అశ్విన్, తాను మరోసారి తండ్రి కాబోతున్నట్లు శుభవార్త ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన భార్య ప్రియాంక గర్భవతిగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ తెలిపారు. 2015లో ప్రియాంకను వివాహం చేసుకున్న నాగ్ అశ్విన్‌కు ఇప్పటికే ఒక కుమారుడు ఉన్నాడు. ఈ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్