లైంగిక వేధింపుల కేసులో డైరెక్ట‌ర్ రంజిత్ అరెస్టు

9478చూసినవారు
లైంగిక వేధింపుల కేసులో డైరెక్ట‌ర్ రంజిత్ అరెస్టు
లైంగిక దాడి కేసులో మ‌ల‌యాళ‌ చిత్ర ద‌ర్శ‌కుడు రంజిత్‌ను ఇవాళ పోలీసులు అరెస్టు చేశారు. ఓ న‌టి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆయనను ఇడుక్కి జిల్లాలో అదుపులోకి తీసుకున్నారు. ఫిల్మ్ సెట్‌లోనే డైరెక్ట‌ర్ రంజిత్‌ త‌న‌పై లైంగిక దాడి చేసిన‌ట్లు ఆ మ‌హిళ కొచ్చి సిటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు కేసు న‌మోదు చేశారు. ఫిల్మ్ షూటింగ్ స‌మ‌యంలో త‌న‌ను కార‌వాన్‌కు రావాల‌ని డైరెక్ట‌ర్ పిలిచార‌ని, ఆ స‌మ‌యంలోనే లైంగిక దాడికి పాల్ప‌డిన‌ట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం తోడుపుజాలో ఉన్న పోలీసు స్టేష‌న్‌లో ఆ డైరెక్ట‌ర్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్