పశ్చిమ గోదావరి వైసీపీలో అసమ్మతి.. ఆశించినట్లు జరగడం లేదా?

6311చూసినవారు
పశ్చిమ గోదావరి వైసీపీలో అసమ్మతి.. ఆశించినట్లు జరగడం లేదా?
AP: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు, నాయకత్వ లోపంపై తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. సీనియర్లను పక్కనపెట్టి, అనవసర ప్రయోగాలు చేయడం, నాయకులు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో పార్టీ పుంజుకోలేకపోతోందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. 2019లో 13 సీట్లు గెలిచిన పార్టీ, 2024 నాటికి ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవాలు వద్దన్న అధినేత ఆదేశాలు కూడా ఇక్కడ అమలు కావడం లేదని, కూటమి ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నించే నాయకత్వం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జ్‌లు అధిష్టానానికి వాస్తవ పరిస్థితులు చెప్పే సాహసం చేయడం లేదని సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్