AP: వైఎస్ జగన్ ప్రతిపాదించిన 'మావిగన్'పై ప్రజల్లో చర్చ జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి తెలిపారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ పారిశ్రామిక అభివృద్ధికి, భూముల ధరల పెరుగుదలకు దోహదపడుతుందని, ఇది ప్రజలకే ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అమరావతి వలన కేవలం చంద్రబాబు, ఆయన బినామీలకే లాభం చేకూరిందని, రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతుందని వివరించారు.