ఇంద్రకీలాద్రి ఆలయంలో అపచారం.. శ్రీ చక్రార్పణ పూజలో ఉపయోగించిన పాలులో పురుగు

51చూసినవారు
AP: ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి శ్రీచక్రార్పణ పూజలో ఉపయోగించిన టెట్రా పాల ప్యాకెట్‌లో పురుగు కనిపించడం కలకలం రేపింది. ఘటనపై ఆలయ ఈవో స్పందించి తక్షణ విచారణకు ఆదేశించారు. స్థానాచార్యుడితో పాటు మరో ఇద్దరు వైదిక కమిటీ సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. పూజలో పాల్గొన్న అర్చకుడి బాధ్యతారాహిత్యమే ఈ ఘటనకు కారణమని ప్రాథమికంగా గుర్తించారు. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్