బంగారం గని వద్ద వివాదం.. 70 మందిని కాల్చి చంపేశారు (వీడియో)

19924చూసినవారు
సౌత్‌ సూడాన్‌ రాజధాని జూబా సమీపంలో గోల్డ్ మైనింగ్ వివాదం రక్తపాతం సృష్టించింది. సెంట్రల్ ఈక్వటోరియా రాష్ట్రంలోని జెబెల్ ఇరాక్ గోల్డ్ మైన్ వద్ద మైనింగ్‌ విషయంలో కంపెనీలు, మైనర్ల మధ్య వివాదం నేపథ్యంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు గన్‌లతో కాల్చి 70 మందికి పైగా వ్యక్తులను హతమార్చారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, మరికొందరు భయంతో అడవుల్లోకి పారిపోయారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్