జనసేన కేడర్‌లో అసంతృప్తి.. పార్టీ ఇంకా బలపడలేదా?

28చూసినవారు
జనసేన కేడర్‌లో అసంతృప్తి.. పార్టీ ఇంకా బలపడలేదా?
AP: జనసేన పార్టీ పెట్టి 12 ఏళ్లు దాటింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. తమ పార్టీ బలపడిందని, స్థానిక ఎన్నికల్లో భారీగా సీట్లు వస్తాయని ఆశించిన జనసేన కేడర్‌కు నిరాశే మిగిలినట్లు ప్రచారం జరుగుతోంది. ఎక్కువ సీట్లు  అడగొద్దని, గెలిచే సీట్లు తీసుకుందామని ఇటీవల మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పడమే దీనికి కారణం. దాంతో జనసైనికులు అసంతృప్తిలో ఉన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్నా.. పదవులు, సీట్లు, అధికారం మాత్రం వేరే వాళ్ల చేతుల్లో ఉందని పలువురు జనసైనికులు చెప్పుకుంటున్నారు. దాంతో రాష్ట్రంలో జనసేన పార్టీ ఇంకా బలపడలేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్