AP: పోలవరం జిల్లా ఎటపాక మండలం విసాపురంలోని ఓ పాఠశాలలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. క్లోరోక్విన్ మాత్రల పంపిణీ కలకలం రేపింది. స్కూల్ సిబ్బంది 73 మంది విద్యార్థులకు ఈ మాత్రలు పంపిణీ చేయగా, వాటిని తీసుకున్న తర్వాత ఇద్దరు
విద్యార్థులు మృతి చెందారు. మరో 20 మంది
విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.