నేటి నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ

103చూసినవారు
నేటి నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ
AP: రైతులకు, భూ యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనుంది. జనవరి 9 వరకూ ఈ పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ఉచితంగా పాసు పుస్తకాలు అందజేయనుంది. మొదటి దశలో 21.86 లక్షల పాసుబుక్స్ పంపిణీ చేయనున్నారు. మొత్తం 34 లక్షలకు పైగా పాసు పుస్తకాలు సిద్ధం చేస్తున్నారు.

ట్యాగ్స్ :