
భార్యను సిలిండర్‌తో కొట్టి చంపిన భర్త
దక్షిణ ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పుల్ ప్రహ్లాద్పూర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి గృహ కలహాల కారణంగా సురేష్ అనే వ్యక్తి తన భార్య పూనమ్‌ను మినీ ఎల్పీజీ సిలిండర్‌తో తలపై కొట్టి హత్య చేశాడు. ఇరుగుపొరుగు వారి అప్రమత్తతతో విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రాథమిక విచారణలో దంపతుల మధ్య జరిగిన వాగ్వాదమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.




