ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తలపడనున్న జోకోవిచ్, అల్కరాజ్

800చూసినవారు
ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో తలపడనున్న జోకోవిచ్, అల్కరాజ్
మెల్‌బోర్న్‌లో జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో సెర్బియా స్టార్ నొవాక్ జోకోవిచ్, స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. ఆదివారం జరిగే తుది పోరులో వీరిద్దరూ తలపడనున్నారు. జోకోవిచ్ గెలిస్తే 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో చరిత్ర సృష్టిస్తాడు, అల్కరాజ్ గెలిస్తే కెరీర్ గ్రాండ్‌స్లామ్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్స్‌లో అల్కరాజ్ జ్వెరెవ్‌ను, జోకోవిచ్ సినెర్‌ను ఓడించారు. 38 ఏళ్ల 241 రోజుల వయసుతో ఫైనల్ చేరిన జోకోవిచ్, ఆస్ట్రేలియన్ ఓపెన్ చరిత్రలో అతిపెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్