రూ.4 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నా పన్ను చెల్లించాలా?

7580చూసినవారు
రూ.4 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నా పన్ను చెల్లించాలా?
వార్షిక ఆదాయం రూ.4 లక్షల కంటే తక్కువగా ఉందని ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయాల్సిన అవసరం లేదనుకోవడం సరైంది కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తక్కువ ఆదాయం ఉన్నవారూ తప్పనిసరిగా ITR దాఖలు చేయాలి. భారీ మొత్తంలో బ్యాంకు లావాదేవీలు, విదేశీ పర్యటనలపై అధిక వ్యయం, అధిక విద్యుత్ బిల్లులు వంటి నిర్దిష్ట ఆర్థిక లావాదేవీలు చేసినా రిటర్న్ సమర్పించాల్సి ఉంటుంది. అలాగే TDS రీఫండ్ పొందడం, భవిష్యత్తులో రుణాలు, వీసా దరఖాస్తులు లేదా ఆర్థిక రికార్డును బలోపేతం చేసుకోవడానికి కూడా ITR దాఖలు చేయడం ఉపయోగకరం. ఆన్‌లైన్‌లో రిటర్న్ సమర్పించిన తర్వాత ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయడం తప్పనిసరి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్