AP: వడ్డీ వ్యాపారి వేధింపులు, స్నేహితుడి మోసాన్ని తట్టుకోలేక ఓ యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సూసైడ్‌కు ముందు సెల్ఫీ వీడియో తీసుకుని తన బాధను వెల్లడించారు. ఈ విషాద ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. బొల్లాపల్లి మండలం రామలాపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవారు. వ్యవసాయ అవసరాల కోసం రూ.10-15 లక్షల అప్పు తీసుకున్నట్లు తెలిసింది. స్నేహితుడికి కొంత డబ్బు ఇవ్వగా.. ఆయన తిరిగి ఇవ్వలేదు. తన కుటుంబానికి న్యాయం చేయండని వేడుకుంటూ.. పురుగుల మందు తాగి నాగిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు.