సెలవు రోజుల్లో సచివాలయ ఉద్యోగులకు విధులు కేటాయించవద్దు: ప్రభుత్వం

8చూసినవారు
సెలవు రోజుల్లో సచివాలయ ఉద్యోగులకు విధులు కేటాయించవద్దు: ప్రభుత్వం
AP: స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం తాజాగా స్పందించింది. సెలవు రోజుల్లో విధులు కేటాయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అర్హత మేరకు ఈఎల్‌లు, ఇంక్రిమెంట్లు, ఇతర సెలవులు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. పని ఒత్తిడి ఫిర్యాదుల పరిష్కారానికి జిల్లా స్థాయిలో కమిటీలు, గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని, డెత్ బెనిఫిట్స్‌ను ఇతర ఉద్యోగులతో సమానంగా ఇస్తున్నామని ప్రభుత్వం తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్