ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు రోజూ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో విటమిన్-A, విటమిన్-C లతో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా టమాటా, రెడ్ క్యాప్సికమ్, బీట్రూట్, దానిమ్మ, చెర్రీస్, యాపిల్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలోని లైకోపీన్, ఆంథోసాయనిన్ యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. క్యాన్సర్ నుంచి కాపాడుతాయి. ఇవి కంటిచూపును పెంచి, చర్మ సౌందర్యాన్ని కాపాడటమే కాకుండా రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తాయి.