చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంకు‌లో ఎలా మార్చుకోవాలో తెలుసా?

11815చూసినవారు
చిరిగిన కరెన్సీ నోట్లను బ్యాంకు‌లో ఎలా మార్చుకోవాలో తెలుసా?
చిరిగిన, పాతబడిన నోట్లను ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ బ్యాంక్‌లోనైనా మార్చుకోవచ్చు. దీనికి ఆ బ్యాంకులో ఖాతా ఉండాల్సిన అవసరం లేదు. మహాత్మా గాంధీ చిత్రం, గవర్నర్ సంతకం, వాటర్‌మార్క్ వంటి ఫీచర్లు స్పష్టంగా ఉండి, నోటు 51% కంటే ఎక్కువ భాగం సరిగ్గా ఉంటే మార్పిడి సులువవుతుంది. ఉద్దేశపూర్వకంగా కాల్చిన, ముక్కలు చేసిన లేదా అసలు రూపాన్ని పూర్తిగా కోల్పోయిన నోట్లను బ్యాంకులు అంగీకరించవు. చిరిగిన నోట్లకు టేపులు వేయడం, గమ్ అంటించడం లేదా పిన్నులు కొట్టడం చేయకుండా ఉన్నది ఉన్నట్లుగా బ్యాంకులో ఇవ్వడం మంచిది.

సంబంధిత పోస్ట్