షుగర్‌ పేషెంట్‌లు ఎండాకాలంలో ఎలాంటి స్నాక్స్ తినాలో తెలుసా..?

7867చూసినవారు
షుగర్‌ పేషెంట్‌లు ఎండాకాలంలో ఎలాంటి స్నాక్స్ తినాలో తెలుసా..?
ప్రస్తుతం డయాబెటిస్ సర్వసాధారణ వ్యాధిగా మారింది. దీనిని అదుపులో ఉంచుకోవడానికి ఆహారపు అలవాట్లు, వ్యాయామం కీలకం. వేసవిలో షుగర్ పేషెంట్లు పెసరపప్పు, మొలకెత్తిన గింజలతో చేసిన సలాడ్లు తీసుకోవడం మంచిది. పెసరపప్పులో ప్రోటీన్లు, ఫైబర్, యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మొలకల్లోనూ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు నిమ్మరసం, బత్తాయి, పుచ్చపండ్లు వంటి నీటిశాతం అధికంగా ఉన్న పండ్లు, పానీయాలు తీసుకోవడం వల్ల శరీరం చల్లగా ఉండి, చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. దోసకాయ ముక్కలు కూడా వేసవిలో శరీరాన్ని చల్లబరచడంతో పాటు దాహాన్ని తీరుస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్