ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ, ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం విద్యుత్ వినియోగంలో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది.
అమెరికా రెండో స్థానంలో ఉంది.
భారత్ మూడవ అతిపెద్ద విద్యుత్ వినియోగ దేశంగా అవతరించింది. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ సవాలుగా మారడంతో,
భారత్ బొగ్గు ఆధారిత ఉత్పత్తిపై ఆధారపడటాన్ని తగ్గించి, సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక శక్తి వనరులపై దృష్టి సారించింది.