వెన్నెముక కలిగిన ఏకైక ఎగిరే క్షీరదం గబ్బిలం. ఇది పగటిపూట తలక్రిందులుగా వేలాడుతుంది. బలహీనమైన కాళ్ల వల్ల నేల మీద నిలబడలేక, ఎత్తైన ప్రదేశం నుంచి క్రిందకు జారి ఎగరడం దీనికి సులభం. శత్రువుల నుంచి రక్షణకు, చీకటిలో వస్తువులను గుర్తించడానికి అల్ట్రాసోనిక్ శబ్దాలను ఉపయోగిస్తుంది. గబ్బిలాల ముఖాలు నక్కల్లా ఉంటాయి, వాటి గుండె నిమిషానికి 1,000 సార్లు కొట్టుకుంటుంది. గ్వానో ఎరువుగా ఉపయోగపడుతుంది. అయితే, గబ్బిలాలు కరిస్తే రేబిస్ సోకే ప్రమాదం ఉంది.