మేడారంలో సమ్మక్క-సారలమ్మలకు శాశ్వత గుడి లేకపోవడానికి ప్రధాన కారణం గిరిజన సంప్రదాయం. ఆదివాసీల నమ్మకం ప్రకారం.. విగ్రహాలకు బదులుగా పసుపు, కుంకుమ, వస్త్రాలు, గద్దెలను పూజిస్తారు. కాకతీయ రాజుల దాడిలో సమ్మక్క, ఆమె కుటుంబం వీరమరణం పొందడంతో, మాఘ శుద్ధ పౌర్ణమికి ముందు బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో గద్దెలపై అమ్మవార్లు కొలువై ఉంటారని, వెన్నెల పడటం వల్ల వారి శక్తి పెరుగుతుందని నమ్ముతారు. గుడి కడితే వెన్నెల గద్దెలపై పడదు కాబట్టి గిరిజనులు గుడి కట్టడానికి అంగీకరించరు.