AP: కాకినాడ జిల్లా తునిలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్జరీలో నిర్లక్ష్యం వహించిన వైద్యుడు సహా సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. సర్జికల్ బ్లేడును శరీరంలోనే వదిలేసి ఆపరేషన్ చేసిన ఆర్థోపెడిక్ వైద్యుడు సత్యసాగర్, స్టాఫ్ నర్సు పద్మావతిని సస్పెండ్ చేస్తూ వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఘటనపై ఫిర్యాదు అందడంతో విచారణ జరిపించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ .. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.