టీ ఆకుల్లో ఉండే పాలిఫెనాల్స్, కెఫీన్ వంటి సమ్మేళనాలు ఎక్కువ వేడి నీటిలో ఎక్కువసేపు మరిగించినప్పుడు అధికంగా విడుదలై, టీ రుచిని గాఢంగా, కొన్నిసార్లు చేదుగా మారుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను 'ఓవర్-ఎక్స్‌ట్రాక్షన్'గా పిలుస్తారు. అయితే బ్లాక్ టీ, మసాలా చాయ్‌లను పాలు, మసాలాలతో కొంతసేపు మరిగించడం వల్ల ప్రత్యేక రుచి వస్తుంది. మంచి టీ రుచి కోసం సరైన నీరు, తగిన ఉష్ణోగ్రత, పరిమిత మరిగింపు సమయాన్ని పాటించడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.