మధుమేహం కంటి చూపును దెబ్బతీస్తుందా?

11187చూసినవారు
మధుమేహం కంటి చూపును దెబ్బతీస్తుందా?
మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారిలో కంటి సమస్యలు సర్వసాధారణం. రక్తంలో చక్కెర స్థాయిలు మారడం వల్ల తాత్కాలికంగా చూపు మసకబారవచ్చు. షుగర్ అదుపులో లేకపోతే కంటి వెనుక రక్తనాళాలు దెబ్బతిని శాశ్వత దృష్టి లోపం ఏర్పడవచ్చు. టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో 25% మందికి కంటి సమస్యలు వస్తాయి. సుదీర్ఘకాలంగా షుగర్ ఉన్నవారు, అదుపులో లేనివారు, బీపీ, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, గర్భిణులు, ఊబకాయం, ధూమపానం చేసేవారికి 'డయాబెటిక్ ఐ' ప్రమాదం ఎక్కువ. మధుమేహం ఉన్నవారు ఏటా కనీసం ఒక్కసారైనా కంటి పరీక్ష చేయించుకోవాలి. చిన్న మార్పు కనిపించినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్