పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి అవసరమా?: సీపీఐ రామకృష్ణ

8679చూసినవారు
పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి అవసరమా?: సీపీఐ రామకృష్ణ
AP: డిప్యూటీ సీఎం పవన్‌పై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వదిలేసి గుళ్లు, గోపురాలు అంటూ తిరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్‌కు దేవాదాయ శాఖ ఇస్తే బాగుంటుందని ఎద్దేవా చేశారు. ప్రశ్నించడానికి పుట్టానన్న పవన్.. కాషాయ దుస్తులు వేసుకుని గుళ్లు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. ప్రశ్నించడం, పాలించడం మానేసి తిరిగే పవన్‌కు డిప్యూటీ సీఎం పదవి అవసరమా? అని ప్రశ్నించారు.