పుట్టుక, మరణంపై ఎన్నో సందేహాలు, నమ్మకాలు ప్రజలను వెంటాడుతుంటాయి. కొందరు ఏదైనా చెడు జరిగితే 'నా తలరాత ఇలా ఉంది' అని, మరికొందరు మరణిస్తే 'ఆయువు అక్కడి వరకే రాసి ఉంది' అని అంటారు. అసలు మరణించే తేదీ కూడా తలరాతలో ముందే రాసి ఉంటుందా అనే ప్రశ్నపై భిన్నాభిప్రాయాలున్నాయి. కొందరు అవునని, ఇది పూర్వజన్మ కర్మలు లేదా భగవంతునిపై ఆధారపడి ముందే నిర్ణయించబడుతుందని, తలరాతలో కూడా రాసి ఉంటుందని పండితులు చెబుతున్నారు. మరికొందరు దీనిని మూఢనమ్మకంగా కొట్టిపారేస్తున్నారు.