కేరళంలోని కొల్లంలో పిచ్చికుక్క దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో స్థానిక పంచాయతీ అధికారులు లైసెన్స్‌డ్ షూటర్‌ను రంగంలోకి దింపి ఆ కుక్కను కాల్చి చంపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో జంతు ప్రేమికులు తీవ్రంగా మండిపడుతున్నారు. మూగజీవాలను చంపే హక్కు ఎవరికీ లేదని, వాటిని జంతు సంరక్షణ కేంద్రాలకు అప్పగించాలని వారు సూచిస్తున్నారు.