దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఉదయం భారీ నష్టాల్లో ట్రేడైన సెన్సెక్స్, నిఫ్టీలు ఆఖర్లో కోలుకుని లాభాల్లో ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ బలోపేతం కావడం, అన్ని రంగాల్లో ఎంపిక చేసిన స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు రాణించాయి. సెన్సెక్స్ 185.23 పాయింట్ల లాభంతో 73,319 వద్ద, నిఫ్టీ 33.70 పాయింట్ల లాభంతో 22,713 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.