లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

3987చూసినవారు
లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లోకి వచ్చాయి. సెన్సెక్స్ 221.69 పాయింట్లు (0.27%) లాభపడి 82,566.37 వద్ద, నిఫ్టీ 76.15 పాయింట్లు (0.30%) లాభపడి 25,418.90 వద్ద ముగిశాయి. హిందూస్తాన్ కాపర్, పరాస్ పెట్రోఫిల్స్, క్యూబెక్స్ ట్యూబింగ్స్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరగా, తారా చంద్ ఇన్‌ఫ్రాలాజిస్టిక్, డిజికాంటెంట్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ వంటి సంస్థలు నష్టాల్లో నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్