దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ప్రారంభమై, ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా నష్టాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 296.59 పాయింట్లు కోల్పోయి 82,269.78 వద్ద, నిఫ్టీ 98.25 పాయింట్లు నష్టపోయి 25,320.65 వద్ద స్థిరపడ్డాయి. పరాస్ పెట్రోఫిల్స్, రేమండ్ రియాల్టీ, రేమండ్ లైఫ్‌స్టైల్, భారత్ బిజ్లీ, భారత్ రోడ్ నెట్‌వర్క్ లిమిటెడ్ కంపెనీలు లాభాల్లో నిలవగా, సౌత్ ఇండియన్ బ్యాంక్, యాక్సిస్ గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్, హిందూస్తాన్ జింక్, కోటక్ గోల్డ్ ఈటీఎఫ్, వేదాంత లిమిటెడ్ నష్టాల జాబితాలో చేరాయి.