20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) వినియోగంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఖండించింది. E20 పెట్రోల్ వల్ల ఇంజిన్లు దెబ్బతినడం, మైలేజీ తగ్గడం, కాలుష్యం పెరగడం వంటి వార్తలు అవాస్తవమని, నిరాధారమైనవని స్పష్టం చేసింది. ARAI, ఇండియన్ ఆయిల్, SIAM వంటి సంస్థల అధ్యయనాలు దీనికి విరుద్ధంగా ఉన్నాయని, E20 వాడకం వల్ల కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు తగ్గుతాయని, వారెంటీకి ఆటంకం ఉండదని ధృవీకరించింది. ప్రజలు తప్పుడు ప్రచారాలను నమ్మకుండా శాస్త్రీయ సమాచారంపై ఆధారపడాలని సూచించింది.