విశాఖ జిల్లా భీమిలి మండలంలోని NSRIET యాజమాన్యం, ఫీజులు చెల్లించని విద్యార్థులను కాలేజీకి రావద్దని ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా చేరిన మొదటి సంవత్సరం విద్యార్థులను రెండు నెలలుగా యాజమాన్యం వేధిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయడంలో జాప్యం జరుగుతున్నందున, తల్లిదండ్రులపై ఒత్తిడి తెచ్చి రూ.10వేలు చొప్పున ఫీజులు వసూలు చేశారు. జనవరి 27న రెండో విడత ఫీజులు చెల్లించని విద్యార్థులను తరగతి గదుల్లోకి అనుమతించకుండా, ఫీజులు చెల్లిస్తేనే రావాలని యాజమాన్యం హుకుం జారీ చేసింది.