AP: కేంద్ర ప్రభుత్వం 'సాస్కి' పథకం కింద ఏపీకి రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను వినియోగించి గ్రామాల్లో దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్లను పునర్నిర్మించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ ఉండదు అని స్పష్టం చేశారు. రహదారుల నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు ప్రమాణాలకు అనుగుణంగా పని చేయాలని ఆదేశించారు