షార్క్, స్వోర్డ్ ఫిష్, ట్యూనా, కింగ్ మాకెరెల్ వంటి పెద్ద చేపలను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాలుష్యం వల్ల నీటిలో చేరే పాదరసం, సీసం వంటి భారీ లోహాలు ఈ చేపల శరీరాల్లో పేరుకుపోవడం దీనికి కారణమని వారు తెలిపారు. ఈ చేపలను తినడం వల్ల మెదడు, నరాల సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొన్నారు.