బిజీ జీవితంలో రాత్రిపూట ఆలస్యంగా తినే అలవాటు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణక్రియ మందగించి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల గుండెల్లో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వస్తాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను, పేగుల్లోని మంచి బ్యాక్టీరియా సమతుల్యతను దెబ్బతీస్తుంది. మధుమేహం ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. నిద్రపోవడానికి కనీసం రెండు, మూడు గంటల ముందు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది.