AP: తనపై దుష్ప్రచారం చేసేవారిని ప్రజాస్వామ్యయుతంగా, చట్టప్రకారమే తిప్పికొట్టాలని జనసైనికులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఘర్షణ పడడం ద్వారా సమస్య మరింత జటిలమవుతుందని తెలిపారు. పదేళ్లుగా తనపై కుట్రలు చేస్తూ రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడొద్దని, ఆవేశానికి గురై గొడవలకు దిగవద్దని ఆయన దిశానిర్దేశం చేశారు. కులమతాల మధ్య విభేదాలు సృష్టించేవారిని చట్టం ముందు నిలబెట్టాలని పేర్కొన్నారు.