ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ బెట్టింగ్‌లపై కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌ను క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా వేదికగా బెట్టింగ్ దందా కొత్త రూపం దాల్చిందని, డబ్బు కోసం ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై నిఘా ఉందని, బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన సూచించారు.