పాఠశాలల వద్ద స్టింగ్‌ ఎనర్జీ డ్రింక్‌ అమ్మకాలపై నిషేధం

18597చూసినవారు
పాఠశాలల వద్ద స్టింగ్‌ ఎనర్జీ డ్రింక్‌ అమ్మకాలపై నిషేధం
మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ‘స్టింగ్‌’ ఎనర్జీ డ్రింక్‌ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ డ్రింక్‌లోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని చేస్తాయనే ఆందోళనల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ మంత్రి నర్‌హరి జిర్వాల్‌, ఎనర్జీ డ్రింక్స్‌తో కలిగే నష్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫీన్, చక్కెర అధికంగా ఉంటాయి.

సంబంధిత పోస్ట్