వివాహానికి ముందు డోప్ పరీక్షలు తప్పనిసరి.. ఆప్ ఎంపీ డిమాండ్

6191చూసినవారు
వివాహానికి ముందు డోప్ పరీక్షలు తప్పనిసరి.. ఆప్ ఎంపీ డిమాండ్
దేశవ్యాప్తంగా పెరుగుతున్న విడాకులు, గృహ హింస కేసుల నేపథ్యంలో, వివాహ సమయంలో అబ్బాయిలకు డోప్ పరీక్షలు, వైద్య పరీక్షలను తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలని ఆప్ MP మల్విందర్ సింగ్ కాంగ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం లోక్ సభలో జీరో అవర్‌లో ఆయన ఈ డిమాండ్‌ను లేవనెత్తారు. వివాహ ధృవీకరణ పత్రం జారీ చేయడానికి ముందు ప్రతి వరుడికి డోపింగ్ పరీక్ష, వైద్యుల ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేస్తూ కొత్త చట్టాన్ని తక్షణమే తీసుకురావాలని ఆయన భారత ప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్