డబుల్ మర్డర్ కేసు.. నిందితుల కోసం పోలీసుల గాలింపు

102చూసినవారు
డబుల్ మర్డర్ కేసు.. నిందితుల కోసం పోలీసుల గాలింపు
AP: నెల్లూరు జిల్లాలోని పెన్నానది సమీపంలో డబుల్ మర్డర్ కేసులో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితులు అర్ధరాత్రి ఇద్దర్ని చంపి నదిలో పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, పెన్నా నది బ్యారేజీ వద్ద రోడ్డుపై రక్తపు మరకలు ఉండటంతో మంగళవారం స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. గజ ఈతగాళ్లలో నదిలో రెండు మృతదేహాలను వెలికి తీశారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్